అగ్గి రాజేసే స్కిల్ లో మీరా టెక్నిక్ వేరే

0

ఉన్నట్టుండి వివాదం రాజేసి ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది మీరా చోప్రా. నేరుగా మంత్రి కేటీఆర్ కే ఫిర్యాదు చేసి హీటెక్కించింది. ఆ గొడవలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి సమస్యను సత్వరం పరిష్కరించారు. మీరాను సామాజిక మాధ్యమాల్లో వేధించిన వారికి తగిన బుద్ధి చెప్పారు. పవన్ హీరోయిన్ అంటూ పదే పదే సినీమీడియాలు అమ్మడికి పాపులారిటీని పెంచడం ఆసక్తికరం.

అప్పటివరకూ ఈవిడ ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలీదు. ఉన్నట్టుండి లైమ్ లైట్ లోకి వచ్చేయడంతో ఆ తర్వాత మీరా లుక్ యాక్టివిటీ మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాల్లో మునుపటితో పోలిస్తే దుమారం ఎక్కువగా కంటిన్యూ అవుతోంది. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ మీరా పాపులరైపోతోంది.

అయితే ఈ అమ్మడు ఎంత ట్రై చేసినా సినిమా ఆఫర్లు మాత్రం రావడం లేదు. వివాదాల రచ్చ ముగిసినా దర్శకనిర్మాతలెవరూ పిలిచి అవకాశాలిస్తున్నది లేదు. కనీసం రిబ్బను కటింగులకు అయినా పిలుస్తున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. తాజాగా మరో వేడెక్కించే ఫోటోతో మీరా టచ్ లోకి వచ్చింది. ఈసారి మాత్రం ఇదేదో ఆన్ లైన్ ప్రమోషనే. రెడీ ఫర్ హెయిర్ షూట్ అని పలకరించింది కాబట్టి ఏదైనా హెయిరాయిల్ బ్రాండ్ ఖాతాలో పడిందనే భావించాలి. యు ఆల్వేస్ లుక్ రాకింగ్ అంటూ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు మరి.