నిత్యానంద కైలాస దేశంపై ఆమె కన్ను పడింది

0

వివాదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద ఏర్పాటు చేసినట్లు చెబుతున్న కైలాస దేశానికి సంబంధించి తమిళనాడుకు చెందిన మరో నటి తాజాగా స్పందించారు. పలు కేసుల్లో చిక్కుకున్న నిత్యానంద.. గుట్టు చప్పుడు కాకుండా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం.. కైలాస దేశం పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేశానని.. తనకంటూ సొంత కరెన్సీని షురూ చేసినట్లుగా చెప్పటం తెలిసిందే. తన కైలాస దేశానికి సంబంధించి అప్పుడప్పడు కొన్ని సందేశాలతో కూడిన వీడియోల్ని ఆన్ లైన్ లో పోస్టులు పెడుతుంటారు.

మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందిన హోటల్ యజమాని ఒకరు స్పందిస్తూ.. తనకు అవకాశం ఇస్తే కైలాస దేశంలో హోటల్ ఏర్పాటు చేస్తానని.. దేశానికి వచ్చే అన్ని దేశాలకు చెందిన అతిధుల మనసు మెచ్చేలా ఫుడ్ అందిస్తానని.. తనకు వ్యాపార అవకాశం ఇవ్వాలని కోరటం తెలిసిందే. తాజాగా తమిళనాడుకు చెందిన మరో నటి కైలాస దేశంపై స్పందించారు.

తనకు కైలాస దేశానికి వెళ్లాలని ఉందని చెప్పటమే కాదు.. నిత్యానందను.. ఆయన దేశాన్ని తెగ పొగిడేయటం ఆసక్తికరంగా మారింది. తరచూ తన మాటలతో వార్తల్లో నిలిచే నటి మీరా మిథున్ తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. నిత్యానందను తెగ పొగిడేస్తున్న ఆమె.. సదరు అథ్యాత్మిక గురువును అందరూ తప్పుగా ప్రచారం చేశారన్నారు.

త్వరలో తాను కైలాస దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పిన ఆమె.. ‘‘లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ నిత్యానందను పొగిడేస్తున్నారు. మీరా మాటలకు నిత్యానందవారు ఎలా రియాక్టు అవుతారో చూడాలి. ఏమైనా.. నిత్యానంద కైలాస దేశానికి తమిళులు చాలా త్వరగా కనెక్టు అవుతున్నట్లుగా అనిపించటం లేదు?