మెగా హీరో మూవీకి గుమ్మడికాయ కొట్టేసారు..!!

0

‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ విజయాలతో జోష్ లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఐదు నెలల తర్వాత తిరిగి స్టార్ట్ చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సింగిల్ షెడ్యూల్ లో మిగతా చిత్రీకరణ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారని తెలుస్తోంది.

కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ.. కరోనా కారణంగా కుదరలేదు. ఇక థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5 ఒరిజినల్’ లో విడుదల చేస్తారని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.