Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరోగా నాగబాబు అల్లుడు..?

హీరోగా నాగబాబు అల్లుడు..?


మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తి. ఇండస్ట్రీలో ఎలాంటి అండా లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి.. చిన్న చిన్న పాత్రలు విలన్ వేషాలు వేసి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. చిత్ర పరిశ్రమలోకి ఆయన నడిచిన బాట.. ఇప్పుడు తన ఫ్యామీలి మెంబర్స్ కి నేషనల్ హైవే వంటిది. ఆ మార్గం ద్వారా ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొచ్చు. ఆ దారిలోనే ఇప్పటి వరకూ ఎంతో మంది డైరెక్టుగా హీరోలయ్యారు. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంత చేసుకున్న పవన్ కల్యాణ్ తో పాటు అల్లు అర్జున్ రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ శిరీష్ హీరోలుగా నటించారు. ఆ తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా మెగా కాంపౌండ్ అండతోనే హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పుడు తాజాగా నిహారిక భర్త చైతన్య కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాారనే ప్రచారం టాలీవుడ్ లో నడుస్తోంది.

అయితే.. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఏ ఫ్యామిలీ నుంచి నటులు వచ్చినా.. అది అరంగేట్రానికి ఉన్న అవకాశం మాత్రమే. ఆ తర్వాత సొంత టాలెంట్ ను బట్టే వారి స్థాయి ఏంటనేది డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో ఒకరిద్దరు హీరోలు తమను ప్రూవ్ చేసుకునే విషయంలో స్ట్రగుల్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

కాబట్టి ఒకవేళ నాగబాబు అల్లుడు చైతన్య కూడా హీరో కావాలనుకుంటే.. ముందుగా యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇండస్ట్రీలో ఎంట్రీకి ఎలాగో ఇబ్బంది లేదుకాబట్టి.. మొదటగా వెబ్ సిరీస్ వంటి ప్లాట్ ఫాంలో యాక్ట్ చేసిన తర్వాత బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చైతన్య తెరంగేట్రం చేస్తాడా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు? అనేది రాబోయే రోజుల్లోనే చూడాలి.