సూపర్ మెహబూబ్ అందరిని గెలుచుకున్నావ్!

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నుండి పదవ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ముందు రోజే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ లీక్ వచ్చింది. అంతా అనుకున్నట్లుగానే.. లీక్ వచ్చినట్లుగానే మెహబూబ్ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించాడు. మెహబూబ్ మొదటి మూడు నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది భావించారు. ఒకటి రెండు సార్లు లక్కీగా నామినేట్ అవ్వక పోవడం వల్ల తప్పించుకున్న మెహబూబ్ ఆ తర్వాత తన సత్తా చాటుతూ వచ్చాడు. చాలా కష్టపడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. హౌస్ లో అందరి కంటే సూపర్బ్ గా డాన్స్ చేయగల కంటెస్టెంట్ మెహబూబ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మెహబూబ్ కంటే చాలా వీక్ అయిన మోనాల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ జనాలు కామెంట్ చేశారు. కాని మోనాల్ ను ఏదో శక్తి మళ్లీ కాపాడింది. మెహబూబ్ ఎలిమినేషన్ ను ప్రకటించిన వెంటనే సోహెల్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అన్ని టాస్క్ ల్లో 200% ఇచ్చే మెహబూబ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అంటూ ఎమోషన్ తో ప్రశ్నించాడు. మెహబూబ్ వెళ్లి పోతున్నాడు అనగానే ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఎప్పుడు గంభీర్యంగా ఎమోషన్ ను కనిపించకుండా ఉండే అభిజిత్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు.

అభిజిత్ ను మెహబూబ్ అన్నయ్య అంటూ సంభోదించడం జరిగింది. ఆ సమయంలో అభిజిత్ కంట తడి వచ్చింది. వెంటనే కన్నీళ్లను తూడ్చుకుని మెహబూబ్ కు సెండాఫ్ ఇచ్చాడు. లాస్య తమ్ముడు జాగ్రత్త అంటూ పంపించింది. అలా ప్రతి ఒక్కరు కూడా మెహబూబ్ కోసం కన్నీరు పెట్టుకున్నారు. ఇంటి సభ్యులు అంతా ఒక్కరి కోసం కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ విన్నర్ గా మెహబూబ్ నిలవక పోయినా అందరి హృదయాలను గెలుచుకున్నావ్ అంటూ ఆయన్ను నెటిజన్స్ అభినందిస్తున్నారు.