మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లికి రెడీ

0

టాలీవుడ్ లో ఈ ఏడాది పలువురు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ పెళ్లి పీఠలు ఎక్కారు. మరి కొందరు కూడా ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లికి రెడీ అవుతున్నారు. రానా.. నితిన్.. నిఖిల్ లు ఇప్పటికే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టగా త్వరలో శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే మరో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తరుణ్ కూడా పెళ్లి పీఠలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడట. 37 ఏళ్ల వయసులో తరుణ్ పెళ్లికి రెడీ అయ్యాడు.

తరుణ్ కుటుంబంకు సన్నిహితం అయిన దూరపు బందువుల అమ్మాయిని ఇప్పికే ఫిక్స్ చేశారట. నాలుగు సంవత్సరాల క్రితమే వీరి పెళ్లి గురించిన చర్చ జరిగిందని అయితే తరుణ్ సినిమాల్లో మళ్లీ కుదురుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించాడట. అందుకే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తరుణ్ నిర్ణయించుకున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నయని అంటున్నారు.

ఈ ఏడాది చివరి వరకు లేదా వచ్చే ఏడాదిలో తరుణ్ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశంది. ఈమద్య కాలం వ్యాపారంతో పాటు మళ్లీ సినిమాలతో కూడా తరుణ్ బిజీ అవుతున్నాడు. హీరోగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో మళ్లీ నటుడిగా తరుణ్ బిజీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.