Templates by BIGtheme NET
Home >> Cinema News >> మృణాల్‌కి రేచీక‌టి.. వ‌రుడి కోసం ఇంట్లో తొంద‌ర‌!

మృణాల్‌కి రేచీక‌టి.. వ‌రుడి కోసం ఇంట్లో తొంద‌ర‌!


మృణాల్ ఠాకూర్ తన అద్భుత‌ నటనతో ప్ర‌జ‌ల‌ హృదయాలను గెలుచుకుంది. దుల్కర్ సల్మాన్‌తో `సీతా రామం`లో ఆమె నటనను అభిమానులు ఇప్పటికీ మ‌ర్చిపోలేకపోతున్నారు. ఈ బ్యూటీ చివరిగా `మేడ్ ఇన్ హెవెన్`లో ఒక ఎపిసోడ్‌లో కనిపించింది. ఇందులో త‌న అద్భుత అభిన‌యంతో మ‌రోసారి యువ‌త‌రం గుండెల్లో నిలిచింది. మృణాల్ తదుపరి అభిమన్యు దస్సానితో కలిసి `ఆంఖ్ మిచోలీ`లో కనిపించనుంది. రాత్రి అంధత్వం(రేచీక‌టి)తో బాధపడుతున్న‌ మృణాల్ కోసం కుటుంబ సభ్యులు తగిన వరుడి కోసం వెతుకుతున్నారు.

తాజా చిత్రం గురించి ప్ర‌స్థావిస్తూ మృణాల్‌ను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్ర‌శ్నించారు. కుటుంబ స‌భ్యులు తనకు అనువైన జోడి కోసం చూస్తున్నారా? అని అడిగారు. దాని గురించి మాట్లాడుతూ, మృణాల్ తన కుటుంబం నుండి చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాన‌ని తెలిపారు. అయితే తగిన వ్యక్తి దొర‌కాలి.. అని అన్నారు. ప్రస్తుతానికి తాను త‌న వాడి కోసం వెతకడం లేదని కూడా వెల్ల‌డించింది. నిజానికి తన‌కు స‌రిజోడు అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అనేది కూడా త‌నే చెప్పింది. హాలీవుడ్ హీరో కీను రీవ్స్ లాంటి కుర్రాడు కావాల‌ని కోరుకుంది. కీను రీవ్స్ కెనడియన్ నటుడు.. ది మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీతో అత‌డు పాపుల‌ర‌య్యాడు. కీనూ రీవ్స్‌పై మృణాల్‌కు అనంత‌మైన ప్రేమ‌.

ఇంతకుముందు ఆదిత్య రాయ్ కపూర్‌తో `గుమ్రా` చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మృణాల్ కీనుతో కలిసి రోడ్ ట్రిప్ చేయడానికి ఇష్టపడతాన‌ని తెలిపింది. ఇటీవల మరొక ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ పాత్ర గీత్ నుండి కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు మృణాల్ చెప్పారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్‌లు కూడా నా జీవితంలో నిజంగా ప్రతిధ్వనించాయి. నాకు ఇష్టమైనవాడి గురించి అని కూడా చెప్పింది. ప్రజలు తమను తాము ప్రేమించుకోవడం మానేసారు. నాకు నేనంటే చాలా ఇష్టం అని కూడా మృణాలు తెలిపింది.