ఇలా అయితే స్టార్ హీరోయిన్ ఎప్పుడవుతావ్ అమ్మడూ…!

0

యంగ్ బ్యూటీ నభా నటేష్ ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడం వల్ల అమ్మడు ఈ మూవీలో నటించిందని కూడా చాలామందికి తెలియలేదు. ఆ తర్వాత రవిబాబు ‘అదుగో’ సినిమాలో నటించినా ఈ బ్యూటీ కెరీర్ కి ఉపయోగపడలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసిన నభా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించింది. ఈ సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయిన నభా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ బ్యూటీ మాత్రం రెమ్యూనరేషన్ చూసుకొని సెకండ్ హీరోయిన్ రోల్స్ కి కమిట్ అవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘డిస్కోరాజా’ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని పట్టించుకున్న ఆడియన్స్.. నభా నటించిందనే విషయమే మర్చిపోయారు. ఇక సాయి ధరమ్ తేజ్ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోందని సమాచారం. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తోంది నభా. దీంతో పాటు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీలో కూడా నభా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాలో మరో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ క్రమంలో లేటెస్టుగా నితిన్ హీరోగా నటించనున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో నభా నటేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అయితే దీంట్లో హీరోయిన్ రోల్ అయినప్పటికీ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. మరో మెయిన్ రోల్ తమన్నా కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నభా అంతగా ప్రాధాన్యత లేని రోల్స్ కే పరిమితం అవుతోందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎప్పుడు వెళ్తావ్ నభా అని తన అభిమానులు అంటున్నారు.