లవ్ స్టోరీ ముగించి థ్యాక్యూ చెబుతున్నాడు

0

కరోనా లాక్ డౌన్ కారణంగా హీరోలు దాదాపు అంతా కూడా దాదాపుగా ఆరు నెలల పాటు ఖాళీగా ఉన్నారు. ఈమద్యే మళ్లీ హీరోలు సినిమాల షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. యంగ్ హీరోలు వరుసగా సినిమాలతో బిజీ అయ్యారు. నాగచైతన్య లాక్ డౌన్ కు ముందు లవ్ స్టోరీ సినిమాను చేస్తున్నాడు.

ఆ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్ కూడా పూర్తి చేయలేక పోయారు. గత నెలలో సినిమాను షూటింగ్ మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల పూర్తి చేశాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ సమయంలోనే చైతూ మరో సినిమాను మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల క్రితం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ ‘థ్యాంక్యూ’ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. తక్కువ మంది నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల సమక్షంలో ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.

వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి దసరా లేదా దీపావళి కానుకగా వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఇప్పటికే మనం సినిమాను చేసిన చైతూ ఇప్పుడు థ్యాంక్యూ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నారు.