సినిమా కోసం 5 రోజులుగా నీళ్లు తాగని నాగశౌర్య…!

0

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమా కోసం బాగా కష్టపడుతూ వస్తున్నాడు. ఇన్నాళ్లూ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతున్న నాగ శౌర్య.. తన లేటెస్ట్ మూవీ కోసం లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న మూవీ కోసం శౌర్య భారీ వర్కౌట్స్ చేసి తన కటౌట్ ని మార్చేశాడు. లాక్ డౌన్ లో ఇన్ని రోజులు జిమ్ లో కఠోర వ్యాయామాలు చేసిన నాగ శౌర్య కండలు తిరిగిన 8 ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఇటీవల శౌర్య పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఎంతో కష్టపడి అబ్స్ తెచ్చుకున్నప్పటికీ వాటిని మైంటైన్ చేయడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే. కానీ నాగశౌర్య #NS20 కోసం ఆ బాడీ మైంటైన్ చేయడానికి షూటింగ్ లో కనీసం నీళ్లు కూడా తాగడం లేదని తెలుస్తోంది.

కాగా #NS20 ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఇటీవలే హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం షూట్ చేస్తున్న కీలకమైన సన్నివేశాల్లో శౌర్య షర్ట్ లేకుండా తన 8 ప్యాక్ బాడీని చూపించాల్సి ఉందంట. దీని కోసం గత 5 రోజులుగా నాగ శౌర్య నీళ్లు త్రాగడం లేదని తెలుస్తోంది. కనీసం తన సలైవా(లాలాజలం) కూడా మింగకుండా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతున్నాడట. సినిమా కోసం ఇంతలా కష్ట పడుతున్న నాగశౌర్యకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో శౌర్య ఆర్చర్ గా కనిపించనున్నాడు. కేతిక శర్మ శౌర్యకు జోడీగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.