బిబి3 కోసం సమరసింహా కాంబో

0

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మూడవ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్ ను గత ఆరు నెలలుగా నిలిపేయడం జరిగింది. త్వరలో మళ్లీ సినిమాను పునః ప్రారంభించేందుకు దర్శకుడు ఏర్పట్లు చేస్తున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ను దర్శకుడు బోయపాటి సంప్రదించాట.

బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సమరసింహారెడ్డి మరియు నరసింహానాయుడు సినిమాల్లో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరు చివరగా ఒక్క మగాడు సినిమాలో నటించారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసిన సిమ్రాన్ కు మళ్లీ బాలయ్య మూవీలో ఛాన్స్ వచ్చినట్లుగా సమాచారం. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని ఒక పాత్రకు సీనియర్ హీరోయన్ జోడీ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను పరిశీలిస్తున్నారని అంటున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో బోయపాటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం బోయపాటి బాలీవుడ్ కు చెందిన ఒక మోడల్ అన్నట్లుగా హింట్ ఇచ్చాడు. ఆ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు సిమ్రాన్ వార్తలపై బోయపాటి ఎలా స్పందిస్తాడో చూడాలి.