మొన్న వెబ్ సిరీస్ ఇప్పుడు ఐటెం సాంగ్ బిబి బ్యూటీ సెటిలయ్యేనా?

0

తెలుగు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు నందినీ రాయ్ సుపరిచితురాలు. అంతకు ముందే ఆమె చాలా సాధించింది. కాని అప్పుడు ఆమెను ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు ఫాలోయింగ్ మొదలైంది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో అందరిలాగే ఈమె కూడా పెద్దగా ప్రయోజనం పొందలేదు. సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించినా కూడా ఆఫర్లు కరువయ్యాయి. వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకుంటూ వస్తున్న ఈ అమ్మడు ఆమద్య ఒక వెబ్ సిరీస్ లో నటించింది.

వెబ్ సిరీస్ లో కాస్త బోల్డ్ గా నటించన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్దం అయ్యింది. ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న కోతి కొమ్మచ్చి సినిమాలో ఐటెం సాంగ్ ను చేసేందుకు ఈమెను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో దర్శకుడు సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ మరియు దివంగత శ్రీహరి తనయుడు మేఘాంశ్ లు హీరోలుగా నటిస్తున్నారు. పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఒక శతమానంభవతి వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సతీష్ ఈ ఇద్దరు హీరోలతో తెరకెక్కిస్తున్నాడట. ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ను నందిని రాయ్ తో చేయించబోతున్నాడు. ఈ ఐటెం సాంగ్ తో అయినా సినిమాల్లో ఈమె కుదురుకునేనా చూడాలి.