Templates by BIGtheme NET
Home >> Cinema News >> నాని “హాయ్ నాన్న” రిలీజ్ పై క్లారిటీ .!?

నాని “హాయ్ నాన్న” రిలీజ్ పై క్లారిటీ .!?


నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న”. మరి మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ముగింపు దశకు చేరుకోగా మేకర్స్ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ చిత్రం ప్రీపోన్ అవుతుంది అని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మరి దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వస్తుంది అని నాని రివీల్ చేసాడు. త్వరలోనే మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేస్తుండగా దీనితోనే డేట్ ని కూడా రివీల్ చేయనున్నారు అని లేటెస్ట్ సమాచారం. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ 8 మరియు 7 లు పరిశీలనలో ఉన్నాయట. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.