Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన నాని ‘వి’…!

ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన నాని ‘వి’…!


కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయిన సినిమాలలో నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ కూడా ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న ‘వి’ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసినప్పటికీ ప్రొడ్యూసర్ మరియు హీరోలు మాత్రం థియేటర్స్ రీ ఓపెన్ చేసే దాకా వెయిట్ చేయాలనే ఆలోచనలో ఓటీటీ రిలీజ్ చేయడానికి సిద్ధపడలేదు. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటం.. పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ‘వి’ మేకర్స్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యారు.

తాజాగా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వారు ‘వి’ మేకర్స్ కి దాదాపు రూ. 30 నుండి రూ. 35 కోట్లకి మధ్య ఆఫర్ చేసినట్లు సమాచారం. మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది మేకర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ థియేటర్స్ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంటే రూ. 25 కోట్ల – రూ 30. కోట్ల మధ్య కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అంతకు మించి అమ్ముడు పోవడం అంటే మేకర్స్ కి ఫ్యాన్సీ ఆఫర్ దక్కినట్లే. కాకపోతే దిల్ రాజు మాత్రం ఇతర ఓటీటీలలో రిలీజ్ చేయడం కంటే స్వయంగా తనే ఓ ఏటీటీ రెడీ చేసి ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. మొత్తం మీద నాని 25వ సినిమా ”వి” ని థియేటర్స్ లో కాకుండా మీ ఇంట్లోనే కూర్చొని చూడొచ్చనే విషయం మాత్రం అర్థం అవుతోంది. ఇదే కనుక నిజమై ‘వి’ లాంటి తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయితే రామ్ ‘రెడ్’.. అనుష్క ‘నిశ్శబ్దం’.. రానా ‘అరణ్య’.. మెగా హీరో ‘ఉప్పెన’ లాంటి సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.