అషిమా నర్వల్ బికినీ బీచ్ నాటకం!

0

`నాటకం` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హర్యానా ఆటమ్ బాంబ్ అషిమా నర్వల్. తొలి సినిమాలో పక్కా పల్లెటూరి యువతిగా కనిపించినా అందాల విందులో మాత్రం ప్యారిస్ మోడ్రన్ గాళ్ కి ఏమాత్రం తీసిపోని స్థాయిలో పిచ్చెక్కించింది. ఆ తరువాత హారర్ థ్రిల్లర్ `జెస్సీ`లో అందాల పందేరంతో అల్లాడించింది. విజయ్ ఆంటోనీ నటించిన `కిల్లర్` లోనూ ఈ అమ్మడు అదిరే పాత్రలో నటించింది. ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేసేసింది అషిమా.

ప్రస్తుతం అరవ్ హీరోగా నటిస్తున్నతమిళ చిత్రం `రాజ భీమ`లో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. గడిచిన ఈ మూడేళ్లలో అషిమా చేసింది మూడు చిత్రాలే అయినా తన గ్లామర్ షోతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని బాగానే దక్కించుకుంది. సినిమాల్లో కంటే అషిమా ఇన్ స్టాలో తెగ పాపులర్ అయిపోతోంది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజనులకు కనువిందు చేస్తున్న అషిమా తాజాగా పింక్ కలర్ బికినీ ధరించి అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటో కుర్రకారులో వైరల్ గా మారింది.

గతంలో బీచ్ లో బ్లాక్ బికినీలో థైస్ పై టాటూ వేయించుకుని రచ్చ చేసిన అషిమా తాజా పింక్ కలర్ బికినీలో బీచ్ ఒడ్డున అందాల విందు చేస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. ఈ ఫొటోలకు నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. కొంత మంది ఇలాంటి ఫొటోలని పోస్ట్ చేయెద్దని కామెంట్ చేస్తే మరికొందరు `హాట్ ..సెక్సీ లుక్` అంటూ కొందరు ఘాటైన కామెంట్ లు చేస్తున్నారు.