మలబారు సాంప్రదాయంలోనే నయన్ పెళ్లి ఏర్పాట్లు!

0

అందాల నయనతార -విఘ్నేష్ శివన్ ప్రేమకథ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ జంట ఒకరికొకరు ప్రేమైక జీవనాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇక పెళ్లి ఒక్కటే పెండింగ్. అయితే అది ఎప్పుడు? అన్నది మాత్రం అస్సలు ప్రకటించేందుకు వెనకాడుతున్నారు.

నేడు ఈ జంట చార్టెడ్ ఫ్లైట్ లో దిగిన వైనం హాట్ టాపిక్ గా మారింది. నయన్ బ్రిటిన్ మహారాణిలా.. అమెరికా అధ్యక్షుడి సతీమణిలా ఓ రేంజులోనే దిగింది. కేరళలో సాంప్రదాయ పెద్ద పండుగ అయిన ఓనంని ఈ జంట ఎంతో సంబరంగా జరుపుకున్నారు. నయనతార తన సోషల్ మీడియాలో “ఎల్లవర్కుం ఎంటె హృదయమ్ నిరంజా ఓనాషామ్సాకల్ (హృదయపూర్వక ఓనం అందరికీ మరియు అందరికీ శుభాకాంక్షలు)“ అనే క్యాప్షన్ తో ఫోటోలను పంచుకున్నారు.

ఈ ఫోటోలు చూస్తుంటే పెళ్లికి ఇంకెంతో సమయం లేదనే అర్థమవుతోంది. ఆ శుభ ఘడియ కోసమే ఎదురు చూస్తున్నారని అర్థమవుతోంది. శింబు.. ప్రభుదేవాలతో ప్రేమాయణాలు బ్రేకప్ తర్వాత నయన్ విఘ్నేష్ తో ప్రేమలో పడ్డారు. సీక్రెట్ నిశ్చితార్థం కానిచ్చేసిన ఈ జంట పెళ్లికి ముందు రకరకాల శాంతులు చేయిస్తున్నారని తెలుస్తోంది.