నెగటివ్.. ఈవారం బిగ్ బాస్ కు గెస్ట్ హోస్ట్ లేనట్లే

0

చిరంజీవి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో అంతకు రెండు రోజుల ముందు ఆయన కలిసి నాగార్జున మరియు సీఎం కేసీఆర్ ల ఆరోగ్యం విషయమై అందరిలో చర్చ జరగింది. ఇటీవల నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. అంటే చిరంజీవి నుండి నాగార్జునకు కరోనా రాలేదు. ఒక వేళ కరోనా పాజిటివ్ అంటూ నాగార్జునకు రిపోర్ట్ వచ్చి ఉంటే రెండు వారాల పాటు గెస్ట్ హోస్ట్ రావాల్సి వచ్చేది. బిగ్ బాస్ నిర్వాహకులకు అదో పెద్ద తలనొప్పిగా మారేది.

ఇప్పటికే రేటింగ్ లేక జుట్టు పీక్కుంటున్న బిగ్ బాస్ కు గెస్ట్ హోస్ట్ ను వెదకడం అంటే చాలా పెద్ద రిస్క్. దాంతో చిరంజీవి కరోనా అనగానే బిగ్ బాస్ నిర్వాహకులు టెన్షన్ పడ్డారు. నాగార్జునకు కరోనా టెస్టు నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. శనివారం నాగార్జున హోస్టింగ్ చేసేందుకు రానున్నాడు. మొన్నటి వరకు వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున ఆ తర్వాత బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కరోనా టెస్టు వల్ల ఆగిపోయాడు అంటూ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.