హీరో నిఖిల్ మరో కొత్త సర్ ప్రైజ్ కథ

0

యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. అందుకే అతడి సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతుంది. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ హిట్ లు పొందుతుంటాడు. తాజాగా నిఖిల్ మరో ప్రయోగానికి రెడీ అయ్యారు.

నిఖిల్ కేరీర్ లోనే అత్యంత వినూత్న కథాంశంతో ‘18 పేజెస్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని టాక్. ఈ సినిమా కథలో హీరో మెమొరీ లాస్ సమస్యతో బాధపడుతూ ఉంటాడని తెలిసింది. ఈ పాత్రను నిఖిల్ చాలెంజ్ గా తీసుకొని బాగా కనిపించబోతున్నాడని.. మూవీ థీమ్ కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని సమాచారం.

ఇప్పటికే నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. కరోనా లాక్ డౌన్ తో ఆగిన మూవీ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట..ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. గీతా ఆర్ట్స్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సుకుమార్ గీతాఆర్ట్స్ ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ ‘కార్తికేయ2’లో నటిస్తున్నారు. ఈ సినిమాపై బోలెడు ఆశలున్నాయి. ఇలా వరుసగా కొత్త కథా కథనాలతో నిఖిల్ ముందుకెళుతున్నాడు.