బీబీసీ అయినా ఈ బికినీకి షేకవ్వాలి నికీషా

0

నికీషా పటేల్.. ఎన్నారై గాళ్ అన్న సంగతి తెలిసిందే. జన్మతః బ్రిటీష్ ఇండియన్. బీబీసీ న్యూస్ ఛానల్ లో షోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన నికీషా పటేల్ సినిమాల్లో నటించాలని యుకే నుంచి ఇండియా వచ్చేసింది. ముందుగా స్టార్ హీరో పవన్ కల్యాణ్ సరసన `పులి` చిత్రంలో నికీషాకు గోల్డెన్ ఆఫర్ లభించింది. అయితే అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది. తొలి సినిమానే దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర వేసింది పరిశ్రమ.

ఆ ముద్రని చెరిపేసుకోవడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నికీషాకు చేదు అనుభవమే ఎదురవుతూ వచ్చింది. తమిళ… కన్నడ భాషల్లో ప్రయత్నించినా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చిన్నా చితకా సినిమాలే. తన స్థాయికి.. గ్లామర్ కి తగ్గ పాత్ర ఏదీ దక్కలేదు. దీంతో దక్షిణాదికి.. ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి మళ్లీ లండన్ చెక్కేసింది.

25 చిత్రాల్లో నటించినా తనని సౌత్ లో ఎవరూ గుర్తించలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియాకు దూరంగా వుంటున్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లో వుంటోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వీడియోలతో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తున్న నికీషా తాజాగా ఓ బికినీ ఫోటోని షేర్ చేసింది. లేలేత పరువాలతో కనువిందు చేస్తున్న నికీషా బికినీ లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.