శహబాష్ నివేథా.. అంతా నీలా ఆలోచించాలి

0

కరోనా కారణంగా ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నది నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కారణంగా సినిమాలు విడుదల కాకపోవడం కొన్ని సినిమాలు షూటింగ్ మద్యలో ఆగిపోవడంతో నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. అందుకే నిర్మాతల శ్రేయస్సు కోసం హీరోలు నిర్మాతలు ఇతర టెక్నీషియన్స్ అంతా కూడా తమ పారితోషికాల్లో కట్టింగ్స్ ను తమకు తాముగా విధించుకోవాలంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే కొందరు హీరోయిన్స్ మరియు హీరోలు మాత్రం తమ రెగ్యలర్ పారితోషికంనే తీసుకుంటున్నారు. కొందరు అయితే గతంలో కంటే కాస్త ఎక్కవే డిమాండ్ చేస్తున్నారు.

వారితో పోల్చితే నివేథా థామన్ చాలా గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇకపై తాను కొత్తగా కమిట్ అవ్వబోతున్న సినిమాలన్నింటికి కూడా ఇప్పటి వరకు తీసుకున్న పారితోషికం కంటే తక్కువ తీసుకుంటాను అంటూ చెప్పింది. కథ నచ్చితే పారితోషికం విషయంలో పట్టింపు లేకుండానే నటిస్తానంటూ నిర్మాతలకు హామీ ఇచ్చింది. నిర్మాతలకు సపోర్ట్ చేసే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది.

అందంతో పాటు ట్యాలెంట్ కూడా కలిగి ఉన్న నివేథా థామస్ ఇంత మంచి మనసుతో పారితోషికం తగ్గించుకునేందుకు సిద్దం అవ్వడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆమె మాదిరిగా ఇతర హీరోయిన్స్ కూడా తమ పారితోషికాలను తగ్గించుకుంటే నిర్మాతలకు ఈ సమయంలో చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు.