Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆగని ఆర్ఆర్ఆర్ రికార్డ్స్.. 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!

ఆగని ఆర్ఆర్ఆర్ రికార్డ్స్.. 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!


స్టార్ హీరోస్ ఎన్టీఆర్ – రామ్చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్న భారీచిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా విడుదలకోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాగా బ్రిటిష్ టైంలో జరిగిన సంఘటనల నేపథ్యంతో ఆర్ఆర్ఆర్ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో చాలా వెరియేషన్స్ కనిపిస్తాయని సినీవర్గాల టాక్. ఆల్రెడీ క్లైమాక్స్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో పూర్తవుతుందట. ‘రామరాజు ఫర్ భీమ్’ ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది ఎన్టీఆర్ ఏ రేంజిలో దర్శనం ఇవ్వనున్నాడో.. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ సాధారణంగా మరికొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

కొమరం భీమ్ పాత్రకోసం ఎన్టీఆర్ తన బాడీని మేకోవర్ చేయడం గమనించవచ్చు. అయితే రాంచరణ్ బర్త్ డే రోజు ‘భీమ్ ఫర్ రామరాజు’ స్పెషల్ ప్రోమో ఎన్టీఆర్ వాయిస్ తో ఓ రేంజిలో వైబ్రేషన్స్ సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ ప్రోమో కూడా సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ వీరంగం సృష్టిస్తాడని ప్రోమో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీమ్ వీడియో యూట్యూబ్లో రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా ఈ ప్రోమో 100మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నట్లు ఫ్యాన్స్ తెలిపారు. అయితే యూట్యూబ్ లో 64.5 మిలియన్స్ ఫేస్బుక్ లో 28.3 మిలియన్స్ ఇంస్టాగ్రామ్ లో 7.37 మిలియన్స్ తో రామరాజు ఫర్ భీమ్ 100 మిలియన్స్ కంప్లీట్ చేసిందని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 13న సినిమా విడుదల కాబోతుంది.