సర్కారు వారి పాట ఇంటర్వెల్ సీన్ ప్రత్యేకత

0

మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో ఇటీవలే ప్రారంభం అయిన సర్కారు వారి పాట సినిమా మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. యూఎస్ లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. కేవలం అయిదు లేదా ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచక పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ భారీ బ్యాంక్ సెట్టింగ్ ను వేయిస్తున్నాడు. మహేష్ బాబు స్టార్ డం.. కథకు తగ్గట్లుగా ఉండేలా ఈ అతి పెద్ద సెట్ ను నిర్మిస్తున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ భారీ సెట్ లో ఇంటర్వెల్ కు ముందు వచ్చే 15 నిమిషాల సీన్స్ అందులోనే చిత్రీకరించబోతున్నారట. ఆ 15 నిమిషాల సీన్స్ కూడా చాలా అద్బుతంగా ఉంటాయని అంటున్నారు. సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుందని అందుకు తగ్గట్లుగా సెట్ ఉండాలనే ఉద్దేశ్యంతో భారీగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక క్లైమాక్స్ కు సంబంధించిన ఒకటి రెండు సీన్స్ కూడా అక్కడ చిత్రీకరణ జరుపబోతున్నారట. అందుకే ఆ సెట్ ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. కీర్తి సురేష్ నటించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులను బట్టి ఈ సినిమా ఆదారపడి ఉంటుంది.