హరీష్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు

0

పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న 26వ సినిమా ‘వకీల్ సాబ్’ సంబంధించిన మోషన్ పోస్టర్ లేదా టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. రేపటి వరకు వకీల్ సాబ్ నుండి రాబోతున్నది ఏంటీ అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో పవన్ క్రిష్ మూవీలో కూడా నటిస్తున్నాడు. పవన్ బర్త్ డే కు క్రిష్ ఏదైనా అప్ డేట్ ఇస్తాడేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

క్రిష్ నుండి ఎలాంటి అప్ డేట్ రాబోవడం లేదు అంటూ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. దాంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా పవన్ 28వ సినిమాను చేయబోతున్న హరీష్ శంకర్ నుండి అప్ డేట్ రాబోతుంది. పవన్ బర్త్ డే కానుకను సెప్టెంబర్ 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఇవ్వబోతున్నాడట. టైటిల్ పోస్టర్ ను హరీష్ శంకర్ విడుదల చేస్తాడని సమాచారం అందుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఏ సినిమా నిర్మించినా కూడా ఆ హీరో పుట్టిన రోజుకు ఖచ్చితంగా సినిమా అప్ డేట్ ను ఇస్తారు. అలాగే ఈ సినిమా అప్ డేట్ ను ఇవ్వాల్సిందే అంటూ మైత్రి వారు చాలా బలంగా కోరుకున్నారు. అందుకు పవన్ మరియు హరీష్ శంకర్ కూడా ఓకే చెప్పడంతో ఫస్ట్ లుక్ లేదా టైటిల్ తో ప్రీ లుక్ ను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ బాబుతో సర్కారు వారి పాటను నిర్మిస్తున్న వీరు షూటింగ్ ప్రారంభం కాకున్నా కూడా పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే పవన్ 28 మూవీ కి కూడా ఏదో ఒక అప్ డేట్ మాత్రం ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యింది.