Templates by BIGtheme NET
Home >> Cinema News >> RX 100 బ్యూటీ బోల్డ్ డెసిషన్?

RX 100 బ్యూటీ బోల్డ్ డెసిషన్?


నటించిన తొలి సినిమాతోనే యువతరంలో అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. మిల్కీ వైట్ అందాలతో కవ్వించే నటనతో ఆకట్టుకుంది. అయితే ఊహించని విధంగా కొన్ని తప్పులు చేసి తన స్థాయిని తగ్గించేసుకోవడం ఇటీవల చర్చకు వచ్చింది.

వెంకీ మామ లాంటి క్లాసిక్ హిట్ లో నటించిన ఈ భామ అంతకుముందు బి గ్రేడ్ మూవీలకు సంతకం చేయడం కెరీర్ కి మైనస్ గా మారింది. రకరకాల కారణాలతో తెలుగులో ఈ బ్యూటీ కి ఆశించినన్ని అవకాశాల్లేకుండా పోయాయి. ఆ క్రమంలోనే హిందీ- తెలుగులో పలు వెబ్ సిరీస్ లకు సంతకాలు చేసేందుకు పాయల్ రెడీ అవుతోందని సమాచారం.

పాయల్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `అనగనగా ఓ అతిథి` ఓటీటీలో ఆదరణ దక్కించుకుంటోంది. ఆ క్రమంలోనే మరిన్ని ఆఫర్లు వరిస్తున్నాయట. మునుముందు మరింతగా తీరిక లేకుండా వెబ్ కంటెంట్ పై సంతకం చేయడానికి పాయల్ ఆసక్తి చూపుతోందిట. తెలుగు- హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన డిజిటల్ షోలు .. వెబ్ సిరీస్ ల కోసం పాయల్ ఒప్పందాలు కుదుర్చుకుంటోందట. ప్రస్తుతం ఇవన్నీ చర్చల దశలో ఉన్నాయి.

పాయల్ రాజ్పుత్ పూర్తిగా డిజిటల్ ప్రపంచానికి షిఫ్టయితే అది బోయ్స్ కి అద్భుతమైన ట్రీట్ అనే చెప్పాలి. బోల్డ్ బ్యూటీకి మరింతగా చెలరేగేందుకు ఆస్కారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల వెబ్ డిజిటల్ కంటెంట్ పై సెన్సార్ షిప్ కి కేంద్రం ఆమోదించింది కాబట్టి పాయల్ రాంగ్ టైమ్ లో డిజిటల్లో ఎంట్రీ ఇస్తోందని భావించవచ్చు.