గుర్రాల్ని గాడిదల్ని పబ్లిక్ లో ముద్దాడేస్తే ఎలా పాపా!

0

ఒంటరి దీవుల్లో తుంటరి వేషాలు వేయాలంటే అందాల కథానాయికల తర్వాతే. మలైకా.. ప్రియాంక చోప్రా.. కరీనా .. శిల్పా శెట్టి.. వీళ్లంతా సీనియర్ తరం అయినా కానీ ఇప్పటికీ బీచ్ పార్టీలతో చిలౌట్ చేస్తూనే ఉన్నారు. అదే బాటలో బాలీవుడ్ నాయిక పూజా బాత్రా శ్రీలంక లో షికార్ ని ఎంజాయ్ చేస్తోంది. లేటెస్టుగా పూజా నడిరోడ్డుపై `రేర్ కిస్` ఇచ్చి షాక్ తినిపించింది. ఇంతకీ ఆవిడ ఎవరికి ముద్దిచ్చింది? అంటే.. అది ఓ యానిమల్. దాని పేరు లామా.

ఇటీవల ఈ అమ్మడు ప్రముఖ విలన్ ని పెళ్లాడి సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాధిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక రాజధాని కొలంబోలో పర్యటిస్తోంది. అక్కడి నుంచి నేరుగా ఇన్ స్టాలో ఒక రొమాంటిక్ పిక్ ని షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. అక్కడ నడిరోడ్ పై ఆ జంతువును ఇదిగో ఇలా ముద్దాడేస్తూ కనిపించింది.

ఇంతకుముందు కూడా ఓ గుర్రాల శాలకు వెళ్లి అక్కడ ఓ రెండు గుర్రాలకు పదే పదే ముద్దులిచ్చేస్తున్న వీడియోని పూజా బాత్రా షేర్ చేసింది. ఆ షార్ట్ వీడియో కూడా వైరల్ గా మారింది. రేర్ కిస్ బాగానే ఉంది కానీ.. సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో లేదేమిటో ఈ భామ? తనతో పాటు ఈ విహార యాత్రలో ఫ్రెండ్ కృష్ణ తంగవేలు కూడా ఉన్నారు. ట్రిప్ ని బాగానే ఆస్వాధిస్తోంది. అయితే మరీ అలా గుర్రాలు గాడిదల్ని పబ్లిక్ లో ముద్దాడేస్తే ఎలా? అన్నదే నిటిజనుల సందేహం. మరి దానికి పూజా ఆన్సర్ ఇస్తుందా? అన్నది చూడాలి. టాలీవుడ్ లో సిసింద్రీ .. గ్రీకువీరుడు చిత్రాల్లో పూజా బాత్రా నటించిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

Anyone who has no feelings for animals has a dead heart. 📸 @nawwabshah

A post shared by Pooja Batra Shah (@poojabatra) on