పూజా హెగ్డేకు అనారోగ్యం.. కరోనా పరీక్ష

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. గత నెల చివరి వరకు ఇటలీలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో పాల్గొంది. గత వారం నుండి ఈమె అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. మరికొన్ని రోజుల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను పూర్తి చేసి రాధేశ్యామ్ షూటింగ్ లో ఈమె జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈసమయంలో ఆమె అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె కరోనా పరీక్షకు వెళ్లారు. ఆమెకు కరోనా నెగటివ్ వచ్చింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినా కూడా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కు బ్రేక్ ఇచ్చిన పూజా హెగ్డే ముంబయికి వెళ్లి పోయింది. అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ కు హాజరు అవ్వబోతుంది. ఈమె రాధేశ్యామ్ షూటింగ్ లో ఈ నెల చివరి నుండి జాయిన్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ షెడ్యూల్ లో పాల్గొంటుందా లేదంటే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను పూర్తి చేస్తుందో చూడాలి.

ఈ ఏడాది ఆరంభంలోనే పూర్తి అవ్వాల్సిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనేక కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. మరో వైపు రాధేశ్యామ్ కూడా ఇప్పటికే ఆలస్యం అయ్యింది. కనుక రెండు సినిమాలకు కూడా ఆమె వచ్చే నెల పూర్తిగా టైం కేటాయించి పూర్తి చేయాల్సి ఉంది. ఈమె బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.