బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటీగా దూసుకు వెళ్తున్న పూజా

0

ఈమద్య స్టార్స్ నుండి చిన్న నటీనటుల వరకు అంతా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఉంటున్నారు. పాపులారిటీని బట్టి ఫాలోవర్స్ ఉంటున్నారు. ఎక్కువ పోస్ట్ లతో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్ గా ఫొటో షూట్స్ మరియు వారి రోజు వారి జీవితంలోని సంఘటనలు సెల్ఫీలు షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కు పదుల సంఖ్యల మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటున్నారు. సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇన్ స్టాలో ఏకంగా 12 మిలియన్ ల ఫాలోవర్స్ నెంబర్ ను టచ్ చేసింది.

తక్కువ సమయంలోనే ఈమె ఈ మైలు రాయి చేరింది. అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారు ఇంకా పది మిలియన్ ల వద్దకు చేరుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అలాంటిది ఈ అమ్మడు ఏకంగా 12 మిలియన్ లను క్రాస్ చేసింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ కు మాత్రమే సాధ్యం అయిన ఈ నెంబర్ ను సాధించి పూజా హెగ్డే త్వరలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లకు పోటీగా దూసుకు వెళ్లడం ఖాయం అనిపిస్తుంది. ఈ ఏడాది చివరి వరకు మరో మిలియన్ ఫాలోవర్స్ ను తన ఖాతాలో వేసుకుని 2021లో 13 మిలియన్ ల ఫాలోవర్స్ తో అడుగు పెట్టే అవకావం ఉందంటున్నారు.