‘సోనూసూద్ కంటే వెయ్యి రెట్లు బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు టాలీవుడ్ లో ఉన్నారు’

0

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడిన ఎంతో మంది పేదవారికి ప్రముఖ నటుడు సోనూ సూద్ తన వంతు సాయం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను బస్సులు ఏర్పాటు చేసి సొంత ఊళ్లకు చేర్చాడు. విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అనేకమందికి కోరిన సాయం చేసి రియల్ హీరోగా అందరి మన్ననలు పొందాడు. అయితే నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సోనూసూద్ లాగా టాలీవుడ్ నటీనటులు ఎందుకు చేయలేకపోయారని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోసాని సమాధానమిస్తూ.. టాలీవుడ్ లో అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు. సోనూ సూద్ ఈ మధ్య వచ్చాడు.. ఆపత్కాలంలో ఆయన కంటే ఎక్కువ సాయాలు చేసిన తెలుగు స్టార్స్ ఉన్నారని.. సోనూ సూద్ లాగా మనోళ్లు పేపర్లలో కనపడరని చెప్పాడు. మహేష్ బాబు – ప్రభాస్ – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎంతోమంది కోట్లలో సాయం అందించారు.. కానీ మనవాళ్లెవరూ బిల్డప్ ఇచ్చుకోరని అన్నాడు.

చాలా సందర్భాల్లో తాను కూడా తోచిన సాయం చేశానని.. అవన్నీ బయటకు చెప్పుకోలేదని.. కొందరు రూపాయి పెట్టి దానికి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నానా హంగామా చేస్తారని చెప్పుకొచ్చాడు. సోనూ సూద్ ని అనడం కాదు కానీ.. గర్వంగా చెబుతున్నా ఆయన కంటే వెయ్యి రెట్లు బ్రాడ్ మైండ్ ఉన్న హీరోలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ టాలీవుడ్ లో ఉన్నారని చెప్పారు. సోనూ సూద్ దేశం మీద ప్రేమతో ఇచ్చాడో దేశ భక్తితో ఇచ్చాడో తెలియదు కానీ బిల్డప్ కోసం ఇచ్చాడని మాత్రం అనలేమని అన్నారు పోసాని కృష్ణమురళి.