‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ అయిదు వారాలు

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కంచి.. 2022 ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు. సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రామాయణాల్లో రాముడి మాదిరిగా కాకుండా విభిన్నంగా ప్రభాస్ రాముడి గెటప్ లో కనిపిచబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఆదిపురుష్ గెటప్ కోసం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అయిదు వారాల పాటు టైం కేటాయించబోతున్నాడట. ఫిజిక్ విషయంలో డిఫరెంట్ గా ప్రభాస్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం తన వ్యక్తిగత ట్రైనర్ తో పాటు అంతర్జాతీయ స్థాయి ట్రైనర్ ల పర్యవేక్షణలో అయిదు వారాల పాటు ప్రభాస్ ఈ వర్కౌట్లు చేయబోతున్నాడట. దాంతో పాటు అత్యుత్తమ విలు విద్య శిక్షకుడి వద్ద ప్రభాస్ మరోసారి బాణం వేయడంను నేర్చుకోబోతున్నాడట. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ గతంలో విలు విద్య నేర్చుకున్నాడు. ఆది పురుష్ కోసం మళ్లీ ప్రభాస్ బాణం వేసేందుకు సిద్దం అవుతున్నాడు.

రాధేశ్యామ్ సినిమా డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంకు పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆదిపురుష్ సినిమా పనిలో ప్రభాస్ పడే అవకాశం ఉంది. ఆదిపురుష్ తో పాటే నాగ్ అశ్విన్ మూవీలో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.