ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ లుక్ షాకిస్తుందట

0

ఆదిపురుష్ 3డి .. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్న ట్రెండీ పాన్ ఇండియా మూవీ. బాహుబలి స్టార్ తో తానాజీ డైరెక్టర్ మూవీ కాబట్టి సంచలనాలు ఖాయమన్న అంచనాలేర్పడ్డాయి. శ్రీరాముడి పాత్ర చిత్రణతో రామాయణం ఆధారాంగా రూపొందనున్న పౌరాణిక డ్రామా ఇది! అన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఈ స్ట్రెయిట్ మూవీతోనే ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నాయికల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం జనవరి నుండి చిత్రీకరణకు వెళ్లనుంది.

తాజా సమాచారం ప్రకారం.. తన పాత్రకు తగినట్లుగా ప్రభాస్ ఈ చిత్రం లో సన్నగా కనిపిస్తారట. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణ్ పాత్రను పోషించనున్నారు. రాధే శ్యామ్ చిత్రీకరణ పూర్తయ్యాక అతను ఈ చిత్రానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తాడు.

ఆదిపురుష్ 2022 ఆగస్టులో హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో విడుదల కానుంది. ఇది 3డి 2డి వెర్షన్లలో తెరకెక్కనుంది. ఆ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించింది.