బికినీలు వేసినా.. అందాలు ఆరబోసినా కానీ..!

0

వరుణ్ తేజ్ `కంచె` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ప్రగ్యాజైస్వాల్. `డేగ` సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆమెకు పేరు తెచ్చిపెట్టింది మాత్రం `కంచె`నే. ఈ మూవీలో హోమ్లీగా కనిపించి ప్రగ్యా వావ్ అనిపించినా అది పిరియాడిక్ డ్రామా కావడంతో పెద్దగా నిరూపించుకునే అవకాశం దక్కలేదు. గ్లామర్ షోకి కూడా అవకాశం లేకపోవడంతో ప్రగ్యకు పూర్తి స్థాయి సంతృప్తి కలగలేదు.

ఆ తరువాత చేసిన `మిర్చిలాంటి కుర్రాడు`.. గుంటూరోడు.. నక్షత్రం.. ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాలు ప్రగ్యాకు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. తొలి ప్రయత్నానికి భిన్నంగా గ్లామర్ ఎంత ఆరబోసినా కమర్షియల్ కథానాయికగా మంచి క్రేజ్ ని అందించలేకపోయాయి. దీంతో గత కొంత కాలంగా ప్రగ్యాకు తెలుగులో ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా లేకుండా పోయింది. అయితేనేం సోషల్ మీడియా ఇన్ స్టాలో మాత్రం ప్రగ్యా కు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిపోతోంది. సినిమాల్లో నటించకపోయినా తన హాట్ ఫొటోలతో అభిమానుల్ని కిర్రెక్కించేస్తోంది.

సోషల్ మీడియాలో నెటిజనులకు హాట్ హాట్ వీడియోలు .. ఫోటోలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. టూ పీస్ టూపీస్ బికినీల్లో అందాల విందు చేస్తూ ఓ రేంజులోనే ఆడుకుంది ఇటీవల. నిరంతరం నెటిజన్స్ ని హీటెక్కించేస్తోంది. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన బికినీ ఫోటో నెటిజనులను హీటెక్కించేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా సెగలు పుట్టిస్తోంది. అసుర సంధ్య వేలలో ప్రగ్యా మేని ఛాయ తళతళా మెరిసిపోతూ మైమరిపిస్తోంది. తదుపరి ఓ క్రేజీ మెగా మూవీలో ప్రగ్యకు ఆఫర్ దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడి రికమండేషన్ వర్కవుటైందని ఒకటే చర్చ సాగుతోంది.