దిశా స్ఫూర్తితో అదే స్పీడ్ లో ప్రగ్య

0

`కంచె` బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవల కెరీర్ పరంగా జీరో అయిపోయిన ఈ అమ్మడు నెమ్మదిగా డిజిటల్లో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటూ ఒక్కో కమర్షియల్ బ్రాండ్ ని ఖాతాలో వేసుకుని సంపాదన పరంగా ఇబ్బంది లేకుండా మ్యానేజ్ చేసేస్తోంది.

సీకే బ్యూటీ దిశా పటానీ స్ఫూర్తితో అదే స్పీడ్ చూపిస్తూ.. ప్రగ్య ఇటీవల పలు ఇన్ వోర్ బ్రాండ్లకు ప్రచారం మొదలు పెట్టింది. ప్రఖ్యాత డీసెల్ కంపెనీ లోదుస్తులకు ప్రగ్యా జైశ్వాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. అందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్లు అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి.

బ్లాక్ డీసెల్ ఇన్ వోర్ ధరించి బ్లూ డెనిమ్స్ టాప్ తో టాప్ లేపేసిన ప్రగ్య లేటెస్టుగా అందుకు పూర్తి భిన్నమైన లుక్ తో షేక్ చేస్తోంది. బ్లాక్ ఇన్ వోర్ పై అదిరిపోయే క్లాసీ సూట్ ని ధరించి ఇదిగో ఇలా ఆత్రంగా వేచి చూస్తూ కనిపించింది. “బీ మై ఎస్కేప్ ఫ్రం మై ఎవ్రీథింగ్..మై నథింగ్“ అంటూ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది ఈ ఫోటోకి. దానికి స్పందించిన ఓ అభిమాని బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఇన్ బ్లాక్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు.

ఈ స్టిల్ ఇప్పటికే సోషల్ మీడియాల్ని షేక్ చేస్తోంది. ప్రగ్య మునుపటితో పోలిస్తే రెగ్యులర్ ఫోటోషూట్లతో అంతకంతకు వేడి పెంచేస్తోంది మరి. అన్నట్టు పవర్ స్టార్ నటించే తదుపరి చిత్రంలో ప్రగ్య జైశ్వాల్ నటించనుందని ప్రచారమైంది. దానికి అధికారిక కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇంకా.