ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు కరోనా

0

కరోనా కోరలు చాస్తోంది. దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి నుంచి రాష్ట్రాల మంత్రులు అధికారుల వరకు అందరికీ కరోనా సోకింది. తాజాగా ప్రముఖ హీరో కూడా కరోనా బారినపడ్డారు.

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ నటుడు హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల ఈ నటుడు జనగణమన అనే మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అక్కడే వైరస్ సోకింది.

ప్రస్తుతం ఫృథ్వీరాజ్ కి ఎలాంటి లక్షణాలు లేనట్లు సమాచారం. అయితే క్వారంటైన్ లోనూ ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ సడలింపులతో ఇటీవల షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫృథ్వీరాజ్ జనగణమన మూవీ షూటింగ్ ను ఎర్నాకులంలో ప్రారంభించారు. అక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఆ చిత్ర దర్శకుడు డిజోజోస్ కి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్ ను ఆపేశారు. దీంతో చిత్రం యూనిట్ అందరికీ పరీక్షలు చేస్తున్నారు. చిత్రం షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.