బుట్ట బొమ్మ.. బాపు బొమ్మ.. రాశీ ముందు దిగదుడుపే

0

అందాల రాశి ఖన్నా తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా ట్రెడిషనల్ రాశీ కోక రైకలో చెలరేగుతున్న తీరు బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. లేటెస్టుగా మరోసారి శారీ ఫోటోషూట్ ను రాశీ విడుదల చేసింది. సాంప్రదాయబద్ధంగా పల్లె పట్టు సుందరిగా మైమరిపిస్తోంది ఈ లుక్ లో. ఎంతో ఆహ్లాదకరంగా లయబద్ధంగా దక్షిణ భారత మహిళా రూపాన్ని ఆవిష్కరించింది. సగం చీరలో విలేజ్ గాళ్ అవతార్ మైమరిపిస్తోంది.

రాశీ చీరకట్టు బొడ్డు దోపుడు స్టైల్ ప్రత్యేకించి కుర్రకారు దృష్టిని ఆకర్షించింది. కాస్త డీ-గ్లామరస్ లుక్ లో కనిపిస్తున్నా.. అదే ప్రత్యేకతను ఆపాదించుకుందని చెప్పాలి. మినిమం మేకప్ సింపుల్ ఆభరణాలు ఆ లుక్కు సంపేస్తోంది అంతే.

ఇప్పుడే తిరిగి కనుగొన్నా.. అంటూ రాశీ ఇచ్చిన క్యాప్న్ ఆసక్తికరం. రాశీలో ఈ కొత్త కోణం కుర్రాళ్లను ఫుల్ చిలౌట్ మూడ్ లోకి తెచ్చేసింది మరి. ఇక ఈ లుక్ చూశాక సీత పాత్రకు రాశీనే ఎంపిక చేయాలేమో. బుట్టబొమ్మ… బాపు బొమ్మ అనే ట్యాగ్ ఇక రాశీకి కూడా ఇవ్వాల్సిందే.