షూటింగ్ కోసం తిరిగి వచ్చేసింది….!

0

బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. గడించిన శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన రకుల్ ను సుమారు 4 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీబీ విచారణ తర్వాత రెండు రోజులు ముంబైలో ఉండిపోయిన రకుల్ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి.

ఈ నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రకుల్ ని మరోసారి విచారించే అవకాశాలు లేవనే ఉద్దేశ్యంతో.. షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చేసి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ముంబైలో నేషనల్ మీడియా ఛానల్స్ ఇబ్బందులు పెడుతున్నాయని.. అందుకే రకుల్ అక్కడ ఉండటానికి ఇష్టపడలేదని అని కూడా అంటున్నారు. ఇక డ్రగ్స్ కేసులో తన గురించి ప్రసారం అవుతున్న వార్తలను ఆపాలని కోరుతూ రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్సీబీ నోటీసులు రావడంతో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న క్రిష్ – పంజా వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. రకుల్ రాకతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్న ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.