రామరాజు ఫర్ భీమ్ మరో అరుదైన రికార్డ్

0

రాజమౌళి సినిమా అంటేనే రికార్డుల మోత మ్రోగడం ఖాయం. బాహుబలి బాలీవుడ్ సినిమాల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు ముందు నుండే రికార్డులను బద్దలు కొడుతోంది. లాక్ డౌన్ లో విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇటీవలే తెలుగులో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా నిలిచింది. ఇక గత నెలలో విడుదలైన రామరాజు ఫర్ భీమ్ ఎన్టీఆర్ టీజర్ కు అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ వచ్చాయి.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కు రాని లైక్స్ రావడంతో రికార్డు సాధించిన రామరాజు ఫర్ భీమ్ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా టీజర్ కూడా లక్ష కామెంట్స్ ను పొందలేదు. కాని ఎన్టీఆర్ టీజర్ లక్ష కామెంట్లను పొందింది. బాలీవుడ్ లో కూడా చాలా తక్కువ టీజర్ లు మాత్రమే లక్ష ఆపై కామెంట్స్ దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ టీజర్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎన్టీఆర్ టీజర్ కు అరుదైన రికార్డులు సొంతం అవుతున్నాయి.

ముందు ముందు ఆర్ఆర్ఆర్ సినిమాకు మరెన్ని రికార్డులు సొంతం అవుతాయో అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్.. ఆలియాలతో పాటు హాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా కనిపించబోతున్నారు.