టీవీషో కోసం మేకప్ వేసుకుని సిద్ధమైన శివగామి..!!

0

టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయినుగా తన అందాలతో సినిలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. దాదాపుగా సౌత్ ఇండియన్ హీరోలు అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. హీరోయినుగా చేసినంత కాలం రమ్యకృష్ణ అభిమానులకు ఆరాధ్య దేవతే. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికి తన అందమైన ఎక్సప్రెషన్స్ తో.. అద్భుతమైన నటనతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఆమె చేసిన పాత్రలే అంతటి గుర్తింపును సంపాదించి పెట్టాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం రమ్యకృష్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలోని శివగామి పాత్రతో ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా మొదలుపెట్టింది. ఒకవిధంగా చెప్పాలంటే బాహుబలి ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది.

అయితే బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొన్ని సినిమాలు చేసింది కానీ ఆ రేంజ్ పేరు రాలేదు. ప్రస్తుతం మహమ్మారి కారణంగా ఇంటిపట్టునే ఉన్న రమ్యకృష్ణ.. ఇటీవలే మళ్లీ మొహానికి మేకప్ వేసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె మేకప్ ఉంది సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదు. జీ తెలుగు టీవీషో కోసం వేసుకుందని చెప్పింది. అంతేగాక ఈ టీవీ షో ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని అంటోంది. మరి ఆ షో ఏంటి..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ‘మీకు నాటి రోజులు గుర్తున్నాయా? వేసవి సెలవులు అయ్యాక స్కూల్కు వెళ్లాలంటే ఎలా ఫీలయ్యేవారో.. ప్రస్తుతం నాకు అదే ఫీలింగ్’ అంటూ మేకప్ వేసుకుంటున్న ఫోటో షేర్ చేసింది రమ్యకృష్ణ. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమె తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ మూవీలో నటిస్తుంది. ఇవేగాక మెగాహీరో సినిమా ఒకటి లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది.