Ramya Krishna : రమ్యకృష్ణ మైండ్ బ్లాంక్ రెమ్యూనరేషన్!

0

Ramya Krishnan : నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ రోజుకు ఒక సినిమాలో నటించేందుకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..

కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేశారు. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేశారు తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన.. పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేశారు.

రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండలో నటిస్తున్నారు. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి.. అదరగొట్టిన సంగతి తెలిసిందే. వీటితో పాటు రమ్యకృష్ణ పలు షోలకు వ్యాఖ్యాతగాను, కొన్ని సిరీయల్స్‌లో కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ..అప్పటికి..ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి..

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈమె..రోజుకు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే కోటి వరకు తీసుకుంటుందన్న మాట. ఇప్పుడు టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న రష్మిక మందన్న సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు తీసుకుటారు. దీన్ని బట్టి చూస్తే రమ్యక్రిష్ణ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రమ్యకృష్ణ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘లైగర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ (Karan Johar) కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్‌ (Mike Tyson) నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఆయన భారతీయ సినిమాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలను లాస్ ఏంజెల్స్ చిత్రబృందం చిత్రీకరించింది. అయితే తన పార్ట్‌కు మైక్ టైసన్ తాజాగా డబ్బింగ్ పూర్తి చేశారట.. మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించారు. థాయ్‌లాండ్‌కు చెందిన కేచా స్టంట్ డైరక్షన్ చేయగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చాలా రోజుల నుంచి ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. .

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది.. Photo : Twitter