మిహిక సినీ ఎంట్రీపై రానా క్లారిటీ

0

టాలీవుడ్ స్టార్ రానా ఇటీవలే మిహిక బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తరాది ముద్దుగుమ్మల మాదిరిగా మిహిక బజాజ్ చాలా అందంగా ఉంటారని ఆమె హీరోయిన్ గా పరిచయం అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు అంటూ ఈమద్య కాలంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇదే సమయంలో ఆమె హీరోయిన్ గా నటించేందుకు సిద్దంగానే ఉందని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ విషయమై హీరో రానా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

మిహికకు సినిమాలపై ఆసక్తి లేదు. ఆమె పూర్తిగా తన ఈవెంట్లు మరియు ఇతర వ్యాపారాలపైనే ఫోకస్ తో ఉంది. ఆమె ప్రస్తుతం చాలా ఆసక్తిగా వ్యాపారంను నిర్వహిస్తుంది. సినిమాల వైపే ఆమె చూడటం లేదు అంటూ రానా పేర్కొన్నాడు. వీరిద్దరు మొదటి దీపావళిని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రానా పుకార్లకు చెక్ పెట్టేలా క్లారిటీ ఇచ్చాడు. రానా ఇప్పటికే విరాట పర్వం షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. మళ్లీ రేపటి నుండి రానా రెగ్యులర్ షూటింగ్ కు హాజరు కాబోతున్నాడు. మరో వైపు మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో పవన్ తో కలిసి రానా నటించే అవకాశం ఉందంటున్నారు. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.