ఇంటి అడ్రస్ చెప్పమని నెటిజన్ ని అడిగిన యాంకర్

0

బుల్లితెరపై హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోలో రష్మీ ఎంత హుషారుగా స్పాంటెనియస్ గా ఉంటుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తుంటుందన్నది తెలిసిందే. మహిళా సాధికారత.. సామాజిక సేవనంలో ఎప్పుడూ రాజీపడని రష్మీ గౌతమ్ ఆగ్రహం వస్తే అపరకాళికలామారిపోతూ తనని విమర్శించిన వారిపై విరుచుకుపడుతూ వుంటుంది.

లాక్ డౌన్ సమయంలో ఆహారం లభించక ఇబ్బందపడుతున్న వీధి శునకాలకు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ వార్తల్లో నిలిచింది. ఈ విషయంలో తనలాగే అంతా స్పందించాలని సోషల్ మీడియా సాక్షిగా ఆకాంక్షించింది. సామాజిక సమస్యల పట్ల బాధ్యతగా స్పందించే రష్మీ గౌతమ్ ని .. మ్యాడమ్ ప్లీజ్ అంటూ.. ఓ నెటిజన్ ఇంటి అడ్రస్ అడగడం ఆసక్తికరంగా మారింది.

ధర్మారెడ్డి అనే నెటిజన్ ఆర్ ఆర్ బీ పోటీ పరీక్షల కోసం కావాల్సిన బుక్స్ కొనే స్థాయిలో తాను లేనని.. తనకు ఈ విషయంలో సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా రష్మీగౌతమ్ ని అభ్యర్థించాడు. దీంతో స్పందించిన రష్మీ గౌతమ్ సదరు నెటిజన్ అడ్రస్ అడిగింది. అడ్రస్ చెబితే తానే ఆ బుక్స్ కొని పంపిస్తానని సమాధానం చెప్పింది. దీంతో రష్మీ గౌతమ్ పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.