పోతురాజుగాడి లవర్ దెబ్బకు బ్లాకు బస్టరే!

0

సింగర్లు యాంకర్లు నటీనటులుగా పాపులరవుతున్న సీజన్ ఇది. జబర్ధస్త్ యాంకర్ గా పాపులరైన రష్మీ గౌతమ్ పెద్ద తెరపై చాలా కాలంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్మీ గౌతమ్ పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. గుంటూర్ టాకీస్ లో ఈ భామ బోల్డ్ పెర్ఫామెన్స్ కి పేరొచ్చింది. అయితే ఆ రేంజులో మరో రోల్ ఏదీ ఇటీవల తనకు దక్కినట్టు లేదు.

ఇక ఈ భామ నందు సరసన `బొమ్మ బ్లాక్ బస్టర్` అనే ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల `బొమ్మ బ్లాక్ బస్టర్` కొత్త లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఇందులో నందు గెటప్ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. జమీందార్ తరహాలో డ్రామా కళాకారుడి కాస్ట్యూమ్ తో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే అర్థమైంది.

తాజాగా కాంబినేషన్ బ్యూటీ రష్మీ గౌతమ్ పోస్టర్ ఇంచుమించు అదేవిధంగా సర్ ప్రైజ్ చేస్తోంది. పోతురాజు గాడి లవర్ వాణీ అంటూ రష్మీని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్. ఆ నెత్తిన కిరీటం.. నుదిటిన విష్ణు నామం.. మెడలో ఆభరణాలు.. పింకు పుష్పాల దండ.. వీటికి ఏమాత్రం సింక్ అవ్వని మోడ్రన్ ఫ్రాకు చూస్తుంటే రష్మీ గౌతమ్ లుక్ సంథింగ్ స్పెషల్ గానే కనిపిస్తోంది. వీళ్లంతా డ్రామా కంపెనీ ఆర్టిస్టులు లేదా సినీఆర్టిస్టులే అనే భావన కలుగుతోంది.

విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ దర్శకత్వంలో ప్రవీన్ పగడాల- బోసుబాబు- ఆనంద్ రెడ్డి- మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ బ్లాక్ బస్టరే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా? లేదా అన్నది జస్ట్ వెయిట్.