రష్మిక డిమాండ్ మామూలుగా లేదు

0

ఈ ఏడాది విడుదల అయిన సినిమాలే చాలా చాలా తక్కువ. చాలా మంది హీరోయిన్స్ ఈ ఏడాదిలో కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమాలో కూడా కనిపించలేక పోయారు. కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయినా కూడా కరోనా కారణంగా రాలేకుండా ఉన్నాయి. కాని రష్మిక మందన్న మాత్రం ఈ ఏడాది రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో ఈ ఏడాది ఆరంభంలోనే రెండు సక్సెస్ లను దక్కించుకున్న రష్మిక మందన్న తన పారితోషికంను అమాంతం పెంచేసింది.

గత ఏడాదిలోనే పుష్ప సినిమాకు కమిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభంకు రెడీ అవుతుంది. ఇదే సమయంలో శర్వాకు జోడీగా ఈ అమ్మడు ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక.. శర్వానంద్ లు జోడీగా నటించనున్నారు. ఈ సినిమాలో నటించబోతున్నందుకు గాను రష్మిక మందన్న తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు అతి తక్కువ మంది మాత్రమే ఆ భారీ పారితోషికంను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ ఈమెకు ఆ భారీ పారితోషికంను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే ఈ అమ్మడి పారితోషికం బాలీవుడ్ హీరోయిన్స్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈమె తమిళంలో కూడా ఒక సినిమాను చేస్తోంది. ఆ సినిమా తర్వాత అక్కడ కూడా రష్మికమందన్న బిజీ అయ్యే అవకాశం ఉంది.