హోటళ్ల లో రష్మిక చిలిపి పనులు.. ఇప్పటికీ మానలేక పోతుందట!

0

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా తాను ఏదైనా ఓ హోటల్కు వెళ్లినప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తుందట. అక్కడ తనకేదన్నా షాంపూ బాటిల్ పిల్లో కవర్ ఇంకేదైనా వస్తువు కనిపిస్తే ఎవరూ చూడకుండా దాన్ని దొంగతనం చేసి తన బ్యాగ్లో సర్దుకుంటుదట. అయితే అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఈ అమ్మడు ఏ హోటల్ వాళ్లకు దొరికిపోలేదు. అయితే ఈ విషయాన్ని స్వయంగా రష్మికా తన ట్విట్టర్ ఫ్యాన్స్కు చెప్పింది. ఇటీవల రష్మిక సోషల్మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటోంది. తన అభిమానులతో అన్ని విషయాలను ఓపెన్గా మాట్లాడుతోంది. కొందరు హీరోయిన్లు ఇటువంటి విషయాలు పంచుకోవడానికి గిల్టీ గా ఫీలవుతుంటారు. కానీ రష్మిక మాత్రం అన్ని విషయాలు నిజాయితీగా చెప్పేస్తోంది. దీంతో ఆమెకు అభిమానుల్లో మరింత గౌరవం పెరిగింది. తెలగులో ఇప్పటికైతే రష్మిక టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నది. సీనియర్ హీరోయిన్లకు క్రేజ్ తగ్గి పోవడం తో ఇప్పుడు పూజా హేగ్డే రష్మిక టాప్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. మహేశ్ బాబు తో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ హిట్ కొట్టడం తో పాటు ఈ సినిమాలో రష్మిక యాక్టింగ్ కు మంచి గుర్తింపు లభించింది. ‘మీకు అర్థమవుతుందా’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ యువత లో బలంగా నాటుకున్నాయి. దీంతో రష్మిక కు సోషల్ మీడియా లో కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది.

అభిమానుల సరదా కామెంట్లు

తాను చిన్ని చిన్న దొంగతనాలు చేస్తా అని రష్మిక ఓపెన్ గా చెప్పడం తో అభిమానులు కూడా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఎంతో నిజాయితీగా నువ్వు చేసిన చిలిపి పనులు చెప్పుకున్నావు. ఎక్కడైనా దొంగతనాలు చేయడం కరెక్ట్ కాదు బట్ నీ నిజాయితీకీ హ్యాట్సాఫ్’ అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ‘రష్మికా.. మొత్తానికి నీ దొంగ బుద్ధిని చాటుకున్నావుగా.. ఇకపై జాగ్రత్తగా ఉండు’ అంటు మరో అభిమాని అభిప్రాయాన్ని చెప్పాడు.

నవ్వే నా బలం

అయితే రష్మిక అభిమానులతో మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ‘చాలా మంది నా బలం బలహీనత ఏమిటని అడుగుతున్నారు. నా నవ్వే నా బలం. ఇక బలహీనత కూడా నవ్వే. చాలా సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు కూడా నేను ఒక్కోసారి నవ్వు ఆపుకో లేకపోతాను. ఇక ఏదైనా పాత్ర లేదా స్టోరీ నచ్చక పోయినా నేను రిజెక్ట్ చేసే విషయాన్ని కూడా నవ్వుతూనే చెబుతాను. దీంతో చాలా మందికి నా మెంటాలిటీ అర్థం కాదు’ అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది ఈ అమ్మడు..