Templates by BIGtheme NET
Home >> Cinema News >> చీరలో రష్మిక అందం మాయ చేస్తోంది

చీరలో రష్మిక అందం మాయ చేస్తోంది


కథానాయికలు తెరపై ఎంత మోడ్రన్ డ్రెస్సుల్లో హల్ చల్ చేసినా సంప్రదాయ చీర కట్టులో కనిపిస్తే ఆ కిక్కే వేరు. వేడుకల్లో పదిమందిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవాలంటే మోడ్రన్ డ్రెస్ ల కంటే చీర కట్టుకు ఉండే ప్రత్యేకతే వేరు. రౌడీ హీరోతో వరుస చిత్రాల్లో నటించి సందడి చేసిన కన్నడ సోయగం రష్మిక మందన్నకు యూత్ లో యమ క్రేజ్ వుంది. ఎంత మోడ్రన్ గా కనిపిస్తుందో అంతకుమించి సాంప్రదాయ చీరకట్టులో మెరిపించే సత్తా ఉన్న బ్యూటీ తను.

నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో వున్న రష్మిక నిత్యం తన వర్కవుట్ల వీడియోలతో పొట్టి నిక్కర్లతో పాటు స్పెషల్ ఫొటో షూట్ లతో ఆకట్టుకుంటోంది. మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ సందడి చేస్తున్న రష్మిక తాజాగా షేర్ చేసిన సారీ లుక్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఆరేంజ్ కలర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కాఫీ కలర్ సారీలో అదిరిపోయే లుక్ లో కనిపించింది.

చురకత్తుల్లాంటి చూపుల్తో చీర కట్టులో రష్మిక అందం మాయ చేస్తోంది. ఈ చీర కట్టులో కనిపించీ కనిపించని అందాలను ఎలివేట్ చేసింది. ఆ సన్నజాజి నడువొంపుల్ని చూపించి కుర్రకారుకు గిలిగింతలు పెట్టేస్తోంది. ప్రస్తుతం చీర కట్టులో మాయ చేస్తున్న రష్మిక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక తెలుగులో `పుష్ప`.. తమిళంలో `సుల్తాన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది.