బ్లాక్ అండ్ బ్లాక్ లో స్టైలిష్ రష్మిక

0

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు ఒక వైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ తమిళంలో కూడా నటిస్తోంది. తెలుగులో ఈమె ‘పుష్ప’ సినిమా లో నటించేందుకు రెడీ అయ్యింది. పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు గాను ఈ అమ్మడు హైదరాబాద్ చేరుకుంది. ఈ అమ్మడు ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ లో బ్లాక్ మాస్క్ ధరించి మస్త్ స్టైలిష్ లుక్ లో కనిపించిన రష్మిక మందన్న సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. క్యూట్ రష్మిక ఫుల్ బ్లాక్ లో చాలా అందంగా ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంది.

ఈ ఏడాదిలో సౌత్ నుండి రెండు సక్సెస్ లు దక్కించుకున్న హీరోయిన్ గా ఈ అమ్మడు రికార్డు సృష్టించింది. మరెవ్వరికి ఈ ఏడాది కనీసం ఒక్క సక్సెస్ కాదు కదా కనీసం సినిమా విడుదలకు కూడా ఛాన్స్ దక్కలేదు. కొందరు హీరోయిన్స్ నటించిన సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదల కాలేదు. కాని రష్మిక మందన్న నటించిన సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలు సంక్రాంతికి ఆ తర్వాత వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక ఈ ఏడాదిలో రెండు సక్సెస్ లు దక్కించుకున్న ఏకైక హీరోయిన్ గా రష్మిక మందన్న నిలిచింది. అందుకే ప్రస్తుతం ఈ అమ్మడికి విపరీతమైన డిమాండ్ ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఈమె ముందు వరుసలో ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.