Templates by BIGtheme NET
Home >> Cinema News >> రవితేజ బయోపిక్ ‘మాస్ మహారాజా’…!

రవితేజ బయోపిక్ ‘మాస్ మహారాజా’…!



ఈ దసరాకి ‘టైగర్‌ నాగేశ్వరరావు’సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వంశీ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌ లో రవితేజ చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.

 నాగేశ్వటైగర్‌రరావు సినిమా ప్రమోషన్‌ లో భాగంగా రవితేజ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన బయోపిక్ గురించి రవితేజ కు ప్రశ్న ఎదురైంది. మీ బయోపిక్ చేస్తే అది ఏ జానర్ కి వస్తుంది.. దాని టైటిల్‌ ఏమి పెట్టవచ్చు.. ఆ బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుంది అన్నట్లుగా ప్రశ్నించిన సమయంలో రవితేజ నుంచి ఆసక్తికర సమాధానం లభించింది.

రవితేజ మాట్లాడుతూ.. తన బయోపిక్ కచ్చితంగా ఎంటర్‌టైన్మెంట్‌ జోనర్‌ లోకి వస్తుంది అన్నాడు. ఇక తన బయోపిక్ లో తానే నటిస్తే బాగుంటుందని కూడా రవితేజ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొత్తానికి రవితేజకు తన బయోపిక్ చేయాలనే ఆసక్తి ఉన్నట్లుగా ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ బయోపిక్ టైటిల్‌ ‘మాస్ మహారాజా’ అంటూ అప్పుడే చెప్పేసుకుంటున్నారు.

సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రవితేజ నటుడిగా ఎలా ఎంట్రీ ఇచ్చాడు, హీరోగా ఎలా మారాడు అనే విషయాలను చాలా ఆసక్తికరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించేందుకు వీలు ఉంటుంది. అందుకే ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా రవితేజ బయోపిక్‌ వస్తే చాలా మందికి ఇన్సిపిరేషన్ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.