తెరపైకి రవితేజ ‘ఖిలాడి’!

0

మాస్ మహరాజ్ రవితేజ తన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’తో ఫామ్లోకి వచ్చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది. భారీ ఓపెనింగ్స్తో మొదలైన ఈ మూవీ జర్నీ.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఫలితంతో.. ఎన్నాళ్లూగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కెరీర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ‘క్రాక్’ సక్సెస్ జోరులోనే తన కొత్త చిత్రం ‘ఖిలాడి’ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వేసవి రేసులో నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సంక్రాంతి కానుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి వేసవి విడుదలను ఖరారు చేసింది చిత్ర యూనిట్.

ఈ ఫెస్టివల్ సందర్భంగానే ‘ఖిలాడి’ హీరోయిన్లు ఎవరనేది కూడా తేలిపోయింది. మాస్ రాజా సరసన ఇద్దరు హాట్ బ్యూటీస్ను తీసుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. వారిలో ఒకరు మీనాక్షి చౌదరి మరొకరు డింపుల్ హయతి.

వీరిలో నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి రెండేళ్ల కిందట ‘ఫెమీనా మిస్ గ్రాండ్’ పోటీల్లో విజేతగా నిలిచింది. మోడలింగ్ ర్యాంపుపై మెరుపులు మెరిపించిన ఈ సుందరి.. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే మూవీలో నటిస్తోందీ అమ్మడు. సుశాంత్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం.. ముగింపు దశలో ఉంది. అయితే.. ఈ సినిమా విడుదల కాకముందే ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి.

ఇక మరో భామ డింపుల్ హయతి గురించి చెప్పాలంటే ‘గద్దలకొండ గణేష్’ను లైన్లోకి తీసుకోవాలి. ఆ చిత్రంలో ‘సూపర్ హిట్టూ నీ హైటు’ అంటూ మంచి మాస్ ఐటెం సాంగ్ చేసింది ఈ భామ. అందులో డింపుల్ ఎంత హాట్గా కనిపించిందో అందరికీ తెలిసిందే. తన స్టెప్పులతో యూత్ ను అలరించింది బ్యూటీ. ఓవరాల్ గా.. మాస్ మహరాజ్ సరసన ఇద్దరూ హాట్ భామల్నే తీసుకున్న రమేష్ వర్మ.. ఈ మూవీలో వాళ్ల అందాల్ని ఏ మేరకు ఎలివేట్ చేస్తాడో చూడాలి. ‘క్రాక్’ తో కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్న రవితేజ.. రాబోయే మూవీతోనూ మంచి హిట్ సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్.