యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఏకంగా 2నెలలు.. తారక్ కి అంత విశ్రాంతి దేనికి?

0

ఇప్పటివరకూ బాలీవుడ్ లో లాంచ్ అయిన తెలుగు హీరోలు ఎవరు? అంటే జంజీర్ తో రామ్ చరణ్ .. సాహోతో ప్రభాస్.. దమ్ మారో దమ్ చిత్రంతో రానా బాలీవుడ్ లో తమ ఖ్యాతిని విస్తరించారు. ఆ ముగ్గురూ అక్కడ కాఫీ విత్ కరణ్ సహా చాలా మీడియా ప్రమోషన్స్ తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి హిందీ ఆడియెన్ లో స్టార్ హీరోల్ని మించిన ఇమేజ్ ఉంది.

అదంతా సరే కానీ.. ఇప్పుడు మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ ఆడియెన్ కి చేరువయ్యేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో బన్ని `పుష్ప` చిత్రంతో హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు నేరుగా ఆర్.ఆర్.ఆర్ లాంటి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. థియేటర్లలో సినిమా ఆడేందుకు ముందే మీడియా ప్రమోషన్స్ తో తారక్ తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. దానికోసం చాలా ప్రిపరేషన్ ని ప్లాన్ చేశారని తెలిసింది.

ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం అతడు తన స్నేహితుడు చరణ్ తో పాటు గా సుదీర్ఘ కాలం పని చేయనున్నారట. దీనికోసం ఏకంగా తారక్ రెండు నెలలు విరామంలో ఉండేందుకు సిద్ధమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి తారక్ త్వరలోనే కొరటాలతో సినిమాని ప్రారంభించేస్తాడని భావించినా కానీ డిసెంబర్ చివరి వరకూ కూడా అతడు సాధ్యమైనంత ఫ్రీగా ఉండాలని భావించారట. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ సుదీర్ఘ షెడ్యూళ్లతో బాగా అలసిపోయిన తారక్.. తన చేతికి చిన్నపాటి శస్త్ర చికిత్సను చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారని గుసగుస వినిపిస్తోంది. అందుకోసం నవంబర్- డిసెంబర్ లో పూర్తిగా రెస్ట్ లో ఉంటారట. అప్పుడు సినిమాల షెడ్యూల్స్ ఏవీ లేకుండా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. నిజానికి ముంబైలో ఒక యాడ్ షూటింగులో పాల్గొనాల్సి ఉండగా దానిని కూడా రద్దు చేశారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచి కొరటాలతో సినిమాని ప్రారంభించాల్సి ఉన్నా కానీ అది మరికాస్త దూరం జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెలుగు-తమిళం-హిందీ సహా పలు భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం తారక్ చాలా ఎగ్జయిటింగ్ గానే ఉన్నారట. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొరటాలతో సినిమాపై పూర్తిగా దృష్టి సారించే వీలుంటుంది. హిందీ ఆడియెన్ కి ఘనంగా పరిచయమవుతున్న తారక్ లో ఆ మాత్రం ఎగ్జయిట్ మెంట్ ఉంటుందనడంలో సందేహమేం లేదు.