ఆర్జీవీ మిస్సింగ్ టీజర్ టాక్

0

ఆర్జీవీ దెబ్బకు మెగాస్టార్ ప్రవణ్ కల్యాణ్ నిన్నట్నుంచి పరార్.. ఇది నిజమా? అవును నిజమే.. అసలు ఆర్జీవీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ ఇద్దరూ ఎందుకని పరారీలో ఉన్నారు? అన్నది తెలియాలంటే ఇదిగో `ఆర్జీవీ మిస్సింగ్` టీజర్ చూడాల్సిందే. దసరాకి దడదడ లాడించాడు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ.

ఆయన మిస్సింగ్ వెనక ఎన్ని కోట్ల డీల్ కుదిరిందో తెలీదు కానీ.. ఇక టీజర్ లో ఆయన శత్రువర్గం అంతా కనిపించింది. గుబురుగడ్డం పెంచి దందాలు చేసే విలన్ గా మారిన పవన్ కల్యాణ్ ని.. ఆయన అన్నయ్య చిరంజీవిని.. ఇక నందమూరి బాలకృష్ణను ఆయన టేబుల్ పై మాన్సన్ హౌస్ బ్రాండుని.. కూడా చూపించారు టీజర్ లో.. ఇక ఇందులో పవన్ మెగా ఫ్యాన్స్ బెదిరింపులు చూపించారు.

ఇక ఆర్జీవీ బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు ఆయన వారసుడు నారా లోకేష్ .. పవన్ ఫ్రెండు త్రివిక్రమ్ .. ఇలా పాత్రధారులందరినీ పరిచయం చేశాడు. నూతన్ నాయుడు పాత్ర అలాగే గజినీకాంత్ పాత్ర అంతే ప్రత్యేకం. ఇక ఆర్జీవీ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు విచ్చేసిన గజినీకాంత్ రజనీకాంత్ నటించేది తక్కువ ఫోజు కొట్టేది ఎక్కువగానే కనిపించింది. రజనీ స్టైల్స్ మ్యానరిజం కోసం జూనియర్ ఆర్టిస్టు బాగానే శ్రమించాడు. పవన్ పాత్రధారి.. చిరు పాత్రధారి ఎక్స్ ప్రెషన్లు.. నన్ను కామెడీ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తాడా? అంటూ.. బాలయ్య డైలాగ్ పవర్ ఇవన్నీ ఈ టీజర్ లో ఫన్ ని జనరేట్ చేసాయి. మొత్తానికి ఆర్జీవీ సెటైరికల్ కామెడీ ఏమేరకు వర్కవుటవుతుందో చూడాలి. `ఆర్జీవీ మిస్సింగ్` .. పీకే ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం ఆయన కొడుకు వల్లనే ..! అంటూ ఆసక్తికర క్యాప్షన్ తో ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయాడు కాబట్టి ఆ మేరకు సక్సస్ కి అది ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి. ఇందులో ఆర్జీవీ నటుడు మాత్రమే. ఆదిర్ వర్మ దర్శకత్వంలో ఛటర్జీ నిర్మిస్తున్నారు.