సింగర్స్ జంట కలర్ ఫుల్ పెళ్లి వేడుక

0

ప్రముఖ గాయకుడు మరియు నటుడు రోహన్ ప్రీత్ సింగ్ మరియు గాయిని నేహా కక్కర్ లు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా వారిద్దరు పెళ్లికి సిద్దం అయ్యారు. పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరి వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెహందీ మరియు హల్దీ ఫంక్షన్ లను సాంప్రదాయబద్దంగా చాలా వైభవంగా నిర్వహించారు. కరోనా టైం అవ్వడం వల్ల కాస్త తక్కువ మంది వచ్చారు. కాని మొత్తానికి అయితే వీరి వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి.

ఇద్దరు కూడా పసుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి మెరిసి పోయారు. వావ్ అనిపించే అందమైన రూపంలో వారు అభిమానులకు మరియు ఫాలోవర్స్ కు కనువిందు చేశారు. ఇండియల్ ఐడియల్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న నేహా కక్కర్ కు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఏకంగా 47 మిలియన్ లమంది ఫాలో అవుతూ ఉంటారు. ఇక రోహన్ ప్రీత్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి జంటకు సోషల్ మీడియా ద్వారా లక్షల మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.